సంతకాలు సేకరిస్తున నాయకులు
ప్రజాశక్తి-డుంబ్రిగూడ: బోయ/వాల్మీకులను ఎస్టి జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధి చిన్నస్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆదివాసి రాష్ట్ర చైర్పర్సన్ పి శాంతకుమారి ఆధ్వర్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బి.సులోచన, జగన్నాథం, హరీష్, తదితరులు పాల్గొన్నారు.










