Apr 07,2023 23:47

నిరసన చేపడుతున్న నేతలు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:బోయ/వాల్మికిలను ఎస్‌టి జాబితాలో చేర్చితే సహించేది లేదని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఆదివాసి చైర్‌పర్సన్‌ పాచిపెంట శాంతకుమారి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ, గిరిజన సంస్కతి, సాంప్రదాయాలు లేని బోయ,వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఎం జగన్మోహన్‌ రెడ్డి శాసనసభలో తీర్మానం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాలలో గిరిజన హక్కులు, చట్టాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. గిరిజన శాసనసభ్యులు హక్కులు, చట్టాలు కాపాడటంలో విఫలమయ్యారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బి.మోహన్‌రావు, కె.పోతురాజు, భగత్రాం, మొస్య, ప్రేమ్‌ కుమార్‌, పి.చిన్నస్వామి, రఘు, భీమారావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.