ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని లైగండ పంచాయతీ ఇసుకగరువు గ్రామంలో నూతన జిసిసి డిఆర్ డిపో భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శిధిలావస్థలోనున్న డిపో వద్ద నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆదివాసి రాష్ట్ర చైర్‌పర్సన్ పి.శాంత కుమారి మాట్లాడుతూ, గతంలో నిర్మించిన డిపో భవనం పూర్తిగా మరమ్మతుకు గురై శిధిలవస్థలో ఉండి ఎప్పుడైనా కూలి పోయే పరిస్థితిలో ఉందన్నారు.జిసిసి ద్వారా పంపిణీ అయ్యే బియ్యం, పప్పుతో పాటు ఇతర వస్తువులు తడిసి పాడవుతున్నాయన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి జిసిసి డిఆర్ డిపోకు నూతన భవనాన్ని నిర్మించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు పి.చిన్నస్వామి, ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ టి.సోమేశ్వరావు, మండల అధ్యక్షుడు జగన్నాథం, రాజబాబు, పరశురాం, అప్పారావు పాల్గొన్నారు.










