ఆందోళన చేపడుతున్న నాయకులు
ప్రజాశక్తి -అనంతగిరి:బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి పాచిపెంట .శాంతకుమారి ఆధ్వర్యన సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్టీ జాబితాలో చేరూస్తూ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం పొందుపరచడం విడ్డురమని, తక్షణమే ఉప సంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సంతకాల సేకరణ పూర్తి అయిన అనంతరం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విన్నవిస్తామని తెలిపారు. ప్రభుత్వంలో మార్పు రాకపోతే అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాంగి శాంతా రావు, పంచాడి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










