ప్రజాశక్తి-కంచికచర్ల : కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కంచికచర్ల లో కాంగ్రెస్స్ పార్టీ అధ్వర్యంలో కాగడాల ప్రదర్శన, ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షులు బొర్రా కిరణ్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేచించి మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. బీజేపీ పాలనలో దేశం అప్పు లక్షల కోట్లుకు చేరిందన్నారు. అదే సమయంలో కార్పొరేట్ల ఆస్తులే అదే స్థాయిలో పెరిగాయని ఆరోపించారు. దేశ సమైక్యత అంటూ మాటలు చెబుతూ దేశ సంపదను వారి ఆర్థిక మిత్రులకు కేంద్రం ప్రధాని మోడీ కట్టబెడుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి పోతురాజు ఏసుదాస్, అక్కల ప్రసాద్,చెరుకు ఆనంద రావు, నాయకులు పోతురాజు థామస్ పాల్, విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవరకొండ శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కర్ల శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










