Jun 04,2023 01:30
సభలో మాట్లాడుతున్న డిఎస్‌ నాగేశ్వరరావు

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: కామ్రేడ్‌ కొల్లి రామమోహన్‌రెడ్డి అలియాస్‌ రాంబాబు సేవలు నిరుపమానం అని పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగ సంఘం నాయకులు నాగేశ్వరరావు అన్నారు. పివి పాలెం మండలం భవనంవారిపాలెం గ్రామంలో జరిగిన పోస్టల్‌ బిపిఎం కొల్లి రామమోహనరెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. పోస్టల్‌ శాఖలో బీపిఎంగా ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. అందరికీ పొదుపు అందరికీ బీమా అనే నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లిన ఘనత ఆయనదే అన్నారు. యూనియన్‌ పట్ల ఆసక్తి కనబరిచే వారన్నారు. తోటి ఉద్యోగులతో, గ్రామ ప్రజల పట్ల రాంబాబు మమకారం మరువలేనిది అన్నారు. యూనియన్‌ పిలుపుమేరకు ప్రతి ఆందోళన కార్యక్రమాలను సమ్మేళనం జయప్రదం చేసిన సృజనాత్మక మేధావి కామ్రేడ్‌ రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా రాంబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఅండ్‌టీ తెనాలి డివిజన్‌ సొసైటీ డివిజనల్‌ సెక్రటరీ సత్యనారాయణ, పోస్ట్‌మాన్‌ ఎన్‌ఎఫ్‌పిఈ డివిజనల్‌ కార్యదర్శి టి పోతురాజు, పోస్టల్‌ అసిస్టెంట్‌ ఎం శివయ్య, ఈ నాగేశ్వరరావు, చందోల్‌ పోస్టాఫీస్‌ ఎస్‌పి ఎం మునీర్‌అహ్మద్‌ పాల్గొన్నారు.