మురుగు కాలువను పరిశీలిస్తున్న మంత్రి నాగార్జున
ప్రజాశక్తి-భట్టిప్రోలు: ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిన దృష్ట్యా రైతులకు ఇబ్బంది లేకుండా కాలువలు శుభ్రం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. భట్టిప్రోలులోని అద్దేపల్లిలో గల కనగాల అప్లియెన్‌ట్ మురుగు కాలువను శుక్రవారం ఆయన పరిశీలించారు. త్వరితగతిన గుఱ్ఱపుడెక్కను తొలగించాలని సూచించారు. అనంతరం జగనన్న కాలనీని సందర్శించి సమస్యలు అడుగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లలితకుమారి, జెడ్పిటిసి ఉదరు భాస్కరి, సర్పంచ్ రవికిరణ్మయి, నాయకులు బాలాజీ, చిన్నారి, నాగేశ్వరరావు, చెన్నయ్య తదితరులు ఉన్నారు.










