ప్రజాశక్తి-ఏలేశ్వరం వందలాది ఎకరాలకు సాగునీరు అందించే కాలువలు పూడికతీతలు వెంటనే తీయాలని రైతులు ఏలేశ్వరంలో మంగళవారం నిరసన చేపట్టారు. సిఐటియు నాయకులు ఆకుల గంగరాజు మాట్లాడుతూ నగర పంచాయతీ అధికారులు ఆక్రమణలు తొలగించిన వ్యర్థాలను పంట కాలువల్లో వదిలేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. ఖరీఫ్ ఆకుముడులను వేసుకోవడానికి కూడా నీరు అందట్లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు కాలంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ కెఎ.కొండలరావుకు, వైసిపి నాయకులకు రైతులు వినతిపత్రం అందించారు.










