Oct 20,2023 21:35

గ్రామస్తులతో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు

ప్రజాశక్తి-వేపాడ :  కాలుష్యం బారి నుంచి రామస్వామిపేట గ్రామస్తులను కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు.. ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని రామస్వామిపేటలో శుక్రవారం పర్యటించి, గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. క్వారీలు, క్రషర్ల వల్ల వచ్చే దుమ్ము, ధూళితో గుండె, ఊపిరితిత్తులు పాడైపోయి అనేకమంది మరణించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీరు కూడా కలుషితం అవుతోందన్నారు. అనంతరం దడాల సుబ్బారావు మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యంగా అడ్డుకోవాలని, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్రామస్తుల పోరాటానికి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.అప్పారావు, ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జగన్‌, నాయకులు సిల్ల కృష్ణ, యనమల రమణ, సిల్ల యర్రయ్యమ్మ, పత్రి చిన్నలక్ష్మి, తమనాన గౌరి, వారధి వెంకట లక్ష్మి, టోనంగి సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.