Sep 14,2023 22:15

ఎఎన్‌యు: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్య కారకాలు, ఉద్గారాలను పెంచుతున్నాయని, వాటిని నియంత్రిచక పోతే మానవ మనుగడకు రాబోయే కాలంలో పెను ప్రమాదాలు తప్పవని పలువురు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ) శిక్షణా సంస్థ (నేషనల్‌ ఇని స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రో అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ని-ఎంఎస్‌ఎంఇ), ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం పర్యావరణ విద్య విజ్ఞానశాఖ విభాగం ఆధ్వ ర్యంలో యూనివర్శిటీలోని సెమినార్‌ హాలులో 'పర్యావరణ మార్పులు సాంకేతిక నిర్వహణ'అనే అంశంపైన వాతా వరణంలో మార్పులపై అంతర్జాతీయ సదస్సు గురు వారం జరిగింది. ముఖ్యఅతిథి వక్ఫ్‌బోర్డు సిఇఒ, సెక్రటరీ ఎం.వి.శేషగిరిబాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించటంతో పాటు నూతన సాంకేతిక విజ్ఞానమైన ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషీన్‌లాంగ్వేజ్‌ వంటి వాటిని ఉప యోగించు కుని ప్రజల్లో అవగాహన కల్పించాల్సి వుందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఉపకులతి ఆచార్య రాజశేఖర్‌ పట్టేటి మాట్లా డుతూ శాస్త్ర, సాంకేతి కను ఉపయోగించి వాతావరణంలో కాలుష్య కారకాల నిరోధానికి కృషిి చేయా ల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. డైరెక్టర్‌ జనరల్‌ ఎంఎస ్‌ఎంఇ డాక్టర్‌ ఎస్‌ గ్లోరీ స్వరూప, కియోటాటెల్‌ సమోయి యూని వర్శిటీ జియాలజీ, ఎన్వీరాన్‌మెంటల్‌ సైన్స్‌ డాక్టర్‌ జార్జి మరోరో ఓన్‌టుమ్‌బి (కెన్యా), డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ ఎన్వినార్‌మెంట్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాట్మండు యూనివర్శిటీ (నేపాల్‌) డాక్టర్‌ నాని రౌత్‌, పర్యావరణ పరిర క్షణ నిపుణులు, పరిశ్రమల సర్వీసు బ్యూరో దనుష్క బంద్ర (శ్రీలంక) మాట్లా డారు. ఎఎన్‌యు రెక్టార్‌ ప్రొఫెసర్‌ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ ప్రొపెసర్‌ బి.కరుణ, కాన్పరెన్స్‌ డైరెక్టర్‌ (ని-ఎంఎస్‌ఎంఇ) కె.సూర్యప్రకాష్‌గౌడ్‌, కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌ జె.కోటేశ్వరరావు (ని-ఎంఎస్‌ఎంఇ, ఎఎన్‌యు పర్యావరణ విజ్ఞాన శాస్త్రం విభాగాధిపతి ప్రొపెసర్‌ పి.బ్రహ్మాజీరావు ప్రసంగించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై పత్ర సమర్పణ జరిగింది.