Nov 17,2022 22:10

ఎస్‌ఇ శ్యాంబాబు
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

            జగనన్న కాలనీ ఇళ్లకు విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్లు త్వరితగతిన అందిస్తున్నామని ఎపిఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ శ్యాంబాబు తెలిపారు. గురువారం మండలంలోని లక్కవరం, తాడువాయి గ్రామాల్లో నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో స్తంభాలు, వీధి దీపాలు, ఇళ్లకు మీటర్ల బిగింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. జగనన్న లేఅవుట్లలో విద్యుత్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చింతలపూడి నియోజకర్గంలో లక్కవరం, తాడువాయి కాలనీలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.