Dec 13,2020 12:48

కల్లోల సాగరాల్ని,
కంటికొనల నుంచి రాలే
భాష్పాలు చేసి,
కలాన నింపి, ఎగసే
బడబానలం నా కలం !
పచ్చని సమాజాన్ని,
బీడువార్చే.. బుద్ధిలేని గ్రీష్మాల్ని..,
ఘర్మజలపు సిరా రాతలతో..
తుఫానై చరచే ఖడ్గం నా కలం !
ధృవాల్లో కరగని
మంచు గుహల్లా..
ఘనీభవించిన మొండి గుండెల్ని,
అక్షరాల పిడుగులతో...
అదిరేలా చేసి,
వేల, వేల సూర్యులై ఉదయించే
ప్రభాతం నా కలం !
కాలంతో నడుస్తూనే....
కర్కశత్వపు నడ్డి విరుస్తూ..
చీకటిని తరిమేస్తూ..
చిత్ర వర్ణాలు లిఖిస్తూ,
శిశిరాల్ని తరిమేస్తూ..
వాసంతాన్ని ఆవిష్కరిస్తూ,
గ్రీష్మాన్ని భయపెడుతూ....
చిరుజల్లై మురిపిస్తూ,
అలసిన మనసుకు స్వాంతనమై..
కాలంతో నడిచే నా కలం,
అపురూపం నాకెంతో !
 

- సుభాషిణి ప్రత్తిపాటి
8099305303