ప్రజాశక్తి - పెద్దాపురం
కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి, వరవిక్రయం, మధుసేవ నాటకాలపై సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ జోష్యుల కృష్ణ బాబు రచించిన కాళ్లకూరి నాటకత్రయ పుస్తకాన్ని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ ఆవిష్కరించారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో సాహితీ స్రవంతి కార్యదర్శి కొత్త శివ అధ్యక్షతన జరిగిన సభ జరిగింది. ఈ సందర్భంగా కెంగారు మోహన్ మాట్లాడుతూ సాహితీ స్రవంతి చరిత్రలో పెద్దాపురం శాఖ అనేక సాహిత్య కార్యక్రమాలు, పుస్తకాల ఆవిష్కరణలు నిర్వహిస్తూ కవులు కళాకారులు, రచయితలను ప్రోత్సహిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. నాటకాలకు సంబంధిం చిన అంశాలను నేటి కాలానికి అనుగుణంగా ఉన్నతీకరించి భవిష్యత్ తరాలకు అందించిన కష్ణ బాబు కషి ప్రశంసనీయమన్నారు. ప్రముఖ కవి రచయిత రెంటాల శ్రీవెంకటేశ్వరరావు నాటక త్రయ సమాలోచన పుస్తకాన్ని సమీక్షించారు. ఈ సభలో రాజమహేంద్రవరానికి చెందిన కడియం సూర్య సుబ్రహ్మణ్యం, డిఎస్‌పి రావు, సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు గణారా, ప్రముఖ వైద్యులు గజరావు సీతారామస్వామి, మేక మన్మధరావు, మార్ని జానకి రామ చౌదరి, చల్లా విశ్వనాథం, వంగలపూడి శివకృష్ణ, దారపు రెడ్డి కష్ణతదితరులు పాల్గొన్నారు .
నాటక త్రయ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సాహితీ వేత్తలు










