Nov 22,2020 11:19

కావాల్సిన పదార్థాలు : కోడిగుడ్లు- ఐదు, కాలీఫ్లవర్‌- ఒకటి, పచ్చిమిర్చి- నాలుగైదు, పెద్ద ఉల్లిపాయ- ఒకటి, శనగపిండి- రెండు టీ స్పూన్లు, మిరియాల పొడి- అర టీ స్పూన్‌, పసుపు- పావు టీ స్పూన్‌, నూనె- తగినంత, ఉప్పు- రుచికి సరిపడా.
                                                  తయారుచేసే విధానం :
ముందుగా కాలీఫ్లవర్‌ను చిన్న ముక్కలుగా తరిగి, ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. తర్వాత అందులోని పువ్వులను మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి.
పచ్చిమిర్చి, ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. శనగపిండి, మిరియాల పొడి, పసుపు, ఉప్పులను నీళ్లతో కలిపి పెట్టుకోవాలి.
కోడిగుడ్లను పగులగొట్టి, శనగపిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, కాలీఫ్లవర్‌ ముక్కలనూ వేయాలి.
పాన్‌లో నూనెవేసి కాగాక, అందులో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకోవాలి. అంతే కాలీఫ్లవర్‌ ఆమ్లెట్‌ రెడీ !