చైత్రవీణపై
వసంతగీతిని
పలికించడానికి వచ్చిన
శుభకృత్ సంవత్సరాదికి
స్వాగతం సుస్వాగతం
ఋతుభ్రమణంలో
అత్యంత సుందరం
అనురాగ మందిరం
ఉగాదే సుమా
అటు పువ్వు
ఇటు నవ్వు
అటు తావి
ఇటు మోవి
ప్రకృతి పారవశ్యమంతా
ఉగాదే సుమా
మావిచిగురులోని
వగరుతిని
కమ్మగా తియ్యగా
పాడే కోయిలకు ఓ నమస్కారం
జాతికి నేర్పుతుంది సంస్కారం
ఆరు రుచులను
నోటికందించి
ఆరోగ్యాన్ని బలపరచే
ధన్వంతరి ఉగాదే సుమా
జీవచలనం
కాలగమనం
ఉగాదే సుమా
ఉగాది వచ్చిందంటే
పచ్చదనం పరిమళించినట్లే
హిందోళం పల్లవించినట్లే
తెలుగుదనం వెల్లివిరిసినట్లే
ఏడాది కాలంపాటు
నూతనోత్సాహాన్ని
నూతనోత్తేజాన్ని
కలిగించేది ఉగాది సుమా
మంకు శ్రీను
89859 90215