Nov 15,2022 23:59

ఆర్‌ఐఒకు వినతిపత్రం ఇస్తున్న ప్రిన్సిపల్‌

ప్రజాశక్తి- కొత్తకోట : కొత్తకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరుతూ విశాఖ ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఆర్‌.సత్యనారాయణకు విన్నవించినట్టు కొత్తకోట కళాశాల ప్రిన్సిపాల్‌ సాయికుమార్‌ తెలిపారు. మంగళవారం విశాఖలోని ఆర్‌ఐఒ కార్యాలయానికి వెళ్లి, పలు సమస్య లపై వినతిపత్రం అందించమన్నారు. ఈ సందర్భంగా త్వరలోనే కళాశాలను సందర్శించి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సిపార్సు చేస్తున్నట్టు ఆర్‌ఐఒ సత్యనారాయణ హామీనిచ్చారని ప్రిన్సిపల్‌ తెలిపారు. విద్యా బోధన, పరీక్షల నిర్వహణ, అకడమిక్‌ సబ్జెక్ట్‌ మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారన్నారు. ప్రిన్స్‌పల్‌ సాయికుమార్‌తో పాటు అధ్యాపకురాలు రమాదేవి, కార్యాలయ సిబ్బంది ఐ విశ్వనాధ్‌ ఆర్‌ఐఒను కలిసిన వారిలో ఉన్నారు.