ఏపీ వెలుగు యానిమేటర్స్ విఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు ఎ. కమల
ప్రజాశక్తి-విజయవాడ
విఓఏలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం ఎన్‌టిఆర్ జిల్లా డి.ఆర్.ఓ మోహన్ కుమార్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విఒఎల ఉద్యోగుల సంఘం జిల్లా నేతలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవాద్యక్షులు ఎ. కమల మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 27,797 మంది విఒఎల కుటుంబాలను రోడ్డున పడేసే మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి వేతనాలు లేకుండా, ఏళ్ల తరబడి సంఘాల ఏర్పాటుకు, అభివద్ధికి, రాత్రి పగలు శ్రమ చేసిన వి ఓ ఏ లకు, మూడు సంవత్సరాల కాల పరిమితి విధించి తొలగించాలని నిర్ణయించడం అన్యాయం అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పేదరికాన్ని నిర్మూలించాలని, కానీ పేదలనే నిర్మించాలనుకోవడం దుర్మార్గమని ఆమె ఆరోపించారు. దీని వలన గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న, విఓఎ లు తమ ఉపాధి కోల్పోయి వీధిని పడే పరిస్థితి ప్రభుత్వమే తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు. అంతేకాకుండా గ్రామ సంఘాలను మెర్జ్ చేయడం వలన, వేలాదిమంది విఓఏలకు ఉపాధి పోతుందని, ఉపాధికి నష్టం లేకుండా ఎక్కువ సంఘాలు ఉన్న విఓల నుండి తక్కువ సంఘాలన్న విఓల కు సర్దుబాటు చేయాలని, ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదు అని, సర్దుబాటుకు అవకాశం లేని విఓలను యధావిధిగా కొనసాగించాలని ఆమె కోరారు. ఫ్రీజింగ్ లో ఉన్న వి ఓ లతో సహా అన్ని రకాల వేతన బకాయిలుచెల్లించాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సంఘాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఉండరాదని, వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యుల లో ఒకరిని నియమించే అవకాశం కల్పించాలని, జెండర్, వయసు, చదువు, పేరుతో తొలగింపులు ఆపాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఆళ్ల ఉమాదేవి,కె. కష్ణకుమారి పాల్గొన్నారు.










