ప్రజాశక్తి -అనంతగిరి:హాస్టల్ వసతి గృహాలలో విద్యార్థినీ, విద్యార్థులకు సరైన నీటి, మరుగుదొడ్ల, వసతి సౌకర్యాలు అందుబాటులేక అవస్థలు పడుతున్నారు. సమీపంలో ఉన్న గెడ్డల్లో కాలా కృత్యాలు, బహిరంగ ప్రదేశంలో స్నానాలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని బాలికల పాఠశాల 2లో నిత్యం సమస్యతో విద్యారుథలు సతమతం అవుతున్నారు. ఈ పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థినిలకు పైగా విద్యని అభ్యసి స్తున్నారు. విద్యార్థులకు సరిపడడా మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎస్‌డబ్ల్యుఓ అధికారిణి సమస్యను పరిష్కరించ లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాల్లో సమస్యలు ఉంటే విద్యార్థులు ఎలా చదువుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇక నైనా వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.










