కాకర్ల సురేష్‌కు అభినందనలు
ప్రజాశక్తి-ఉదయగిరి : పేదల ఆరోగ్యాన్ని ముందుగా తెలుసుకొని ప్రస్తుత సీజన్‌లో ఏడు మంది వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్న టిడిపి నాయకులు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్‌కు లెక్కలవారిపాలెం గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఆదివారం నియోజకవర్గంలోని వింజమూరు మండలం లెక్కలవారిపాలెంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ 7 మంది ఉన్నత డాక్టర్ల పర్యవేక్షణలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఎన్‌టిఆర్ సంజీవనీ ఆరోగ్య రథంతో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు డాక్టర్ సంధాని, డాక్టర్ జె.సంధ్య, డాక్టర్ కె.మనోజ్ కుమార్, డాక్టర్ టి.లాస్య, డాక్టర్ కె.సంతోషి, డాక్టర్ కె.గిరీష్ కుమార్ డాక్టర్ రవికుమార్ అందిస్తున్న మెరుగైన వైద్యంపై గ్రామస్తులు కాకర్ల సురేష్‌కు అభినందనలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పేషెంట్లు మాట్లాడుతూ ఇంత మంది డాక్టర్లతో తమ గ్రామానికే వచ్చి వైద్య నిర్వహించి మెరుగైన వైద్యం అందివడం ఇదివరకెప్పుడూ తాము చూడలేదని ప్రస్తుత సీజన్లో ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రయివేటు వైద్యశాలలు ఫీజులు భారమై బాధపడుతున్న తరుణంలో ఇలా ఉచిత వైద్యసేవలు అందించడం సంతోషదాయకమన్నారు. ఇలాంటి ఉత్తమ నేత అత్యున్నత స్థాయులకు చేరాలని, తమ దీవెనలు ఆయనకు తోడుగా ఉంటాయని ఆశీర్వదించారు. కార్యక్రమంలో గద్దె జయంత్, చంద్రశేఖర్ ఎన్‌ఆర్‌ఐ కోనేటి మార్కండేయులు, రాము, కముద్రా శ్రీనివాసులు, బండూరం సత్యనారాయణ, భువనేశ్వరం విజరు, మాలాద్రి, గ్రామస్తులు పాల్గొన్నారు.










