May 31,2023 23:24

నూతన వస్త్రాల షోరూం ఇభ ను ప్రారంభిస్తున్న సినీనటి అనసూయ

- నూతన వస్త్ర ప్రపంచం ఇభ షోరూమ్‌ ప్రారంభం
ప్రజాశక్తి - కాకినాడ
కాకినాడలో సినీనటి అనసూయ సందడి చేశారు. వస్త్రశ్రేణి ప్రపంచంలో మరో నూతన షోరూమ్‌ ఇభ కాకినాడ టూటౌన్‌ సెంటర్‌ హౌండా షోరూమ్‌ ఎదురుగా బుధవారం సినీనటి అనసూయ ప్రారంభించారు. అభిమానులు అనసూయకు ఘన స్వాగతం పలికారు. అభిమానులకు అభివాదం చేస్తూ వారితో ఫోటోలు దిగారు. షోరూమ్‌ అధినేతలు, అభిమానులు సందడి మధ్య ఇభ షోరూమ్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వస్త్ర ప్రపంచంలో రోజురోజుకూ ఫ్యాషన్లు మారిపోతున్నాయని, అందుకు అను గుణంగా రకరకాల డిజైన్లతో నూతన షోరూమ్‌ ఇభ కాకినాడలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు, యువతులు తాము కోరుకున్న రకరకాల డిజైన్లు, మోడల్స్‌ అందుబాటు ధరలతో లభిస్తాయని, ప్రతిఒక్కరూ ఆదరించాలని కోరారు. షోరూమ్‌ నిర్వాహకులు కె.నాగేశ్వరరావు, టి. అమరనాధ్‌, కెవి. నాగేశ్వరరావు, బి. రాధాకష్ణ మాట్లాడుతూ తమ ఇభ షోరూమ్స్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నాయని ఇప్పుడు నూతనంగా కాకినాడలో ప్రారంభించినట్టు తెలిపారు. త్వరలోనే మరో మూడు షోరూములు జిల్లాలో అనసూయతో ప్రారం భోత్సవం చేయిస్తామన్నారు. కార్యక్రమంలో షోరూమ్‌ మేనేజర్లు చిన్న, మూర్తి, సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు.