Aug 04,2023 23:51

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ చిన్న సినిమాగా రిలీజై సంచలనం సష్టించిన బేబీ సినిమా యూనిట్‌ శుక్రవారం కాకినాడలో సందడి చేసింది. హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవి చైతన్య, వీరాజ్‌ అశ్విన్‌, సినీ దర్శకుడు సాయిరాజేష్‌ కాకినాడ పద్మప్రియ థియేటర్‌లో ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లు మాట్లాడుతూ సినిమాపై చూపించిన అభిమానం మరువలేదని, చిన్న సినిమాను ఇంత విజయం సాధించిందంటే ప్రేక్షకులే కారణం అన్నారు.