ప్రజాశక్తి-వన్‌టౌన్: సామాన్య రైతు బిడ్డగా జీవితం ప్రారంభించినకాకాని వెంకటరత్నం వివిధ ఉన్నత స్థాయిల్లో తుదిశ్వాస వరకు రైతు సమస్యల పరిష్కారానికి నిర్విరామంగా కృషి చేశారని, ఆయన సేవలు ఆదర్శణీయమని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కొనియాడారు. గురువారం కాకాని వెంకటరత్నం 123వ జయంతి సందర్భంగా మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కాకాని వెంకటరత్నం వ్యవసాయ, పశుపోషక, పాలసేకరణ శాఖలకు మంత్రిగా పనిచేసారని, ముఖ్యంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేష కషి చేశారని అన్నారు. కష్ణా మిల్క్ యూనియన్ స్థాపనలో ఆయన చూపిన చొరవ, సల్పిన కషి మరువలేనిదన్నారు. సమితి అభివద్ధికి తద్వారా పాడి రైతుల ఆర్థికాభివద్ధికి వీరవల్లి గ్రామంలో నిర్మిస్తున్న నూతన డెయిరీని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు మాట్లాడుతూ కాకాని వెంకటరత్నం ఆశయాల స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో యూనియన్‌ని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టి తద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా కషిచేయాలని అధికారులు, సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు చలసాని చక్రపాణి, సమితి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










