ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం తాటితూరు గోస్తనీపై కాజ్ వే నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఎంపిపి దంతులూరి వెంకట శివ సూర్య నారాయణ రాజు చెప్పారు. గ్రామ సర్పంచ్ శిరిగుడి సంతోషి, మాజీ సర్పంచ్ దుంపల నాగమణి, వైసిపి నాయకులు పొట్నూరు చంద్రశేఖర్, శిరిగుడి ఈశ్వరరావు, దుంపల ప్రభాకర్, దాకమర్రి ఎంపిటిసి సభ్యులు చెల్లూరి నగేష్‌బాబు తదితరులతో కలిసి సంబంధిత ప్రాంతాన్ని శనివారం ఎంపిపి పరిశీలించారు. కాజ్‌వే ఆవశ్యకతను ఎంపిపి దృష్టికి నాయకులు తీసుకెళ్లారు. ఇందుకు ఆయన స్పందిస్తూ, ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు రూ.2 కోట్లతో కాజ్‌వే నిర్మాణ పనులు త్వరలో ప్రారంభ మవుతాయని స్పష్టం చేశారు.
రూ.20 వేలు సాయం
అనారోగ్యంతో ఉన్న తాటితూరు కళ్లాలకు చెందిన వి.పెదరమణను ఎంపిపి పరామర్శించారు. రూ.20 వేలు ఆర్థిక సాయం చేశారు.










