Jul 20,2023 21:20

అవగాహన కార్యక్రమంలో మాట్లాడతున్న శారదమ్మ

 కలసపాడు మండలంలోని శం ఖవరం పంచా యతీలో పశువుల కత్రిమ గర్భధారణ విజయవంతంపై రైతులకు చక్కగా అవగాహన కల్పిం చాలని, జిల్లా పశు వైద్య సంచాలకులు డి.సి. శారదమ్మ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటుచేసిన కత్రిమ గర్భధారణపై రైతులకు అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పరిధిలో కత్రిమ గర్భధారణలో సుమారు 60 లేగ దూడలు విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ 60 లేగ దూడల ప్రదర్శనలో ప్రధమ, ద్వితీయ, ద్వితీయ, బహుమతులను స్థానిక సర్పంచ్‌ డి. రాధాదేవి, ఉపసం చాలకులు, డాక్టర్‌ వెంకటరమణయ్య, పశువైద్యాధికారి ఎ. వెంకటేశ్వరరావు, డిఎల్‌డిఎ రమేష్‌ సహాయ సంచాలకులు డాక్టర్‌ చంద్రశేఖర్‌, చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మిగిలిన రైతులందరికీ కన్సలేషన్‌ బహుమతులను కూడా అందించారు. అనంతరం గోపాలమిత్ర చెన్నయ్య ఃకు సన్మానం చేసి అభినందించారు.