Aug 02,2021 10:57

మహబూబ్‌నగర్‌ : ఎగువ నుండి భారీగా వరద చేరడంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్‌ 36 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‌ ఫ్లో 3,97,500 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 3,85,527 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టిఎంసి లు ఉండగా, ప్రస్తుతం 6.823 టిఎంసి లకు చేరింది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.290 మీటర్లుగా నమోదయింది.