
ప్రజాశక్తి-తెనాలిరూరల్ : తెనాలి చినరావూరు పార్కు రోడ్డులో జనసేన పార్టీ కార్యాలయాన్ని రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. జనసేన పార్టీ అధినేత పవన కళ్యాణ్ ఆదేశాలతో పార్టీ కార్యాలయాన్ని తెనాలిలో ప్రారంభించడం సంతోషమన్నారు. తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెనాలి రాజకీయాల్లో నూతనవోరవడి సృష్టిస్తామన్నారు. వైవిపి ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకూ జనసేన పార్టీ తరపున కంకణం కట్టుకున్నామన్నారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన సంఘం జాగర్లమూడి ప్రాంతానికి చెందిన నారాయణ కుటుంబ సభ్యులకు పార్టీ తరపున రూ 5 లక్షలు చెక్కును అందించారు. పార్టీ వర్గాల్లో ప్రమాదవశాత్తు మరణించిన సైనికులకు ప్రమాదభీమా అందిస్తున్న పవన్ కళ్యాణ్ అభినందనీయులన్నారు.