Oct 09,2023 16:51
  • జనసేన నియోజకవర్గ ఇంచార్జీ బండారు శ్రీనివాస్.

ప్రజాశక్తి - ఆలమూరు : వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని జనసేన నియోజకవర్గ ఇంచార్జీ బండారు శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మోతుకూరులో నేతలు తోరాటి తాతారావు, రావూరి గణపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన గ్రామ పర్యటనలో పార్టీ శ్రేణులతో ఆయన మమేకమయ్యారు. ముందుగా డా బిఆర్ అంబేత్కర్, డా. బాబుజగజ్జీవన రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరినీ కలసి ఈసారి కుటుంబ సమేతంగా(జనసేన పార్టీ)గుర్తుకు ఓటు వేయడం వల్ల ఉపయోగం ప్రజలకు వివరించారు. 2024లో ఏర్పడేది జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. తమ పార్టీ  నాయకుడు పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారని ఆయన తెలిపారు. విలువలు, ఆశయాల కోసం పార్టీని నడుపుతున్న తమ నాయకులు  పవన్ వైసీపీ పతనం కొరకు కంకణం కట్టుకొని అడుగులు వేయడం మొదలయిందని ఆయన అన్నారు. జగన్ ఓడిపోవడం ఖాయమని, జనసేన గెలవడం తథ్యమని రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి ప్రజలు నీరాజనాలు పడుతున్న విషయం వారాహి యాత్ర విజయం వల్ల అందరికీ అర్థం అవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు, జనసేన సర్పంచులు, వార్డ్ మెంబెర్స్,వీర మహిళలు, జనసేన నాయకులు,అధిక  సంఖ్యలో పాల్గొన్నారు.