
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన వీర మహిళలకు దసరా పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో దసరా పండుగ జరుపుకోవాలని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వీర మహిళలు కుటుంబ సభ్యులతో పండుగను ఉల్లాసంగా జరుపుకోవాలని ఆకాంక్షతో చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ముందస్తు దుర్గాష్టమి, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు ఆచారి వీరయ్య, జనసేన వీర మహిళలు రజిత, జడ్డ శిరీష తదితరులు పాల్గొన్నారు.