Sep 27,2023 16:24

ప్రజాశక్తి-పాకాల : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగుల కోసం సెప్టెంబర్ 29వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ మొహిద్దిన్ భాష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జెకెసి విభాగం ఆధ్వర్యంలో డిగ్రీ పాసైన విద్యార్థులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అన్నారు.అపోలో ఫార్మసీ ఫ్లిప్కార్ట్,క్విస్,కార్ప్ సొల్యూషన్స్ కంపెనీలు వివిధ ఉద్యోగాల కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని  అన్నారు.జాబ్ మేళాకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించడం జరిగిందని,డిగ్రీ పాసై ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా అన్ని ఒరిజినల్,జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అన్నారు.పూర్తి వివరాలకు జెకెసి సమన్వయకర్త డాక్టర్ ఎస్ వి రమేష్ కుమార్ 9491520740 ను సంప్రదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఈశ్వర బాబు,మోహన్ బెహరా,మాధవి,రమణమ్మ, రవి తదితరులు పాల్గొన్నారు.