ప్రజాశక్తి- భీమునిపట్నం : చిట్టివలస జ్యూట్‌మిల్లు కార్మికులందరికీ పరిహారం పూర్తిగా చెల్లించాలని యాజమాన్య ప్రతినిధిని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో యాజమాన్య ప్రతినిధి జెసిఎల్.రామారావు, మిల్లులోని 4 కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, రెండేళ్లు నుంచి ఇవ్వాల్సిన పిఎఫ్ సొమ్ము చెల్లించాలని, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చెల్లించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విజయ దశమి నాటికి బకాయిలు చెల్లించాలని యాజమాన్యానికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటక్ నుంచి చిల్ల రమణ, జీరు వెంకటరెడ్డి, కాకాస నుంచి జి.అప్పారావు, దల్లి అప్పలరెడ్డి, ఎం.ఆదినారాయణ, ఎఐటియుసి ప్రతినిధులు కొండపు ఈశ్వరరావు, అల్లు బాబూరావు, టిఎన్‌టియుసి నాయకులు ఎస్.అచ్చారావు, ఎంవి.గురుమూర్తి, ఎన్.రామారావు తదితరులు పాల్గొన్నారు.










