జ్యూట్ కార్మికులకు మద్దతు తెలుపుతున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి-సాలూరు రూరల్ : జీగిరాం జ్యూట్‌మిల్లును తెరిపించాలని 35 రోజులుగా కార్మికులు చేపడుతున్న దీక్షలకు అంగన్వాడీలు మద్దతు తెలిపారు. జ్యూట్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సోమవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సందర్శించి, కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు రాజమ్మ, పోలమ్మ, మరియమ్మ, నిర్మల, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు, కార్మిక జెఎసి నాయకులు శ్రీనివాసరావు, శంకర్రావు పాల్గొన్నారు.










