సాలూరురూరల్: 15 నెలలుగా మూతబడిన జీగిరాం జ్యూట్ మిల్లును వెంటనే తెరవాలని, కార్మిక జెఎసి చేపట్టిన దీక్షలకు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఆమె దీక్షా శిబిరం వద్దకు చేరుకొని, కార్మికులకు మద్దతు తెలిపారు. వైసిపి అధికారంలోకి వస్తే మూతపడ్డ జ్యూట్ మిల్లులను తెరిపిస్తామని హామీ ఇచ్చిందని, ఈ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. జిల్లాలో ఉన్న ఏకైక జ్యూట్ మిల్లును కూడా కాపాడుకోలేని స్థితిలో నేడు వైసిపి ప్రభుత్వం ఉందన్నారు. కార్మికుల ఉపాధి దృష్ట్యా ఈ మిల్లును నడిపేందుకు, తెరిచేందుకు ప్రభుత్వం, యాజమాన్యం, కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టే దీక్షకు టిడిపి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, నడిమింటి రామకష్ణ, కసినబోయిన వెంకటరమణ, ఆర్.సింహాచలం, కె.శ్రీను, గోపి ఉన్నారు.










