ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక మున్సిపల్ ట్రావెలర్స్‌్ బంగ్లాలో ఫూలే విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, జెసి జి.రాజకుమారి, ఇతర అధికారులు నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నగర కార్యదర్శి నళినీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, నాయకులు బి.శ్రీనివాసరావు, ముత్యాలరావు, జి.మరియదాసు, ఎంఎ చిష్టి, కెవిపిఎస్ నగర నాయకులు కొండలరావు, ఎమ్మెల్సీలు కె.ఎస్.లక్ష్మణరావు, ఎల్.అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తాఫా, కిలారి రోశయ్య, జిల్లాపరిషత్ చైరపర్సన్ హెనీ క్రిస్టినా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్లు సజీలా, డైమండ్‌బాబు, వైసిపి జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు, బిసి సంఘం నాయకులు జూపూడి శ్రీనివాసరావు, అంగిరేకుల వరప్రసాద్, వైకే, కుమ్మర క్రాంతికుమార్, సురేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం పాల్ విజరు కుమార్, నగర ఉపాధ్యక్షులు సయ్యద్ జాని, ఎంఆర్‌పిఎస్ వ్వవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్‌కుమార్, మాల మహానాడు జిల్లా కార్యదర్శి దారా హేమప్రసాద్, నాయీబ్రాహ్మణ జెఎసి అధ్యక్షులు తాటికొండ నరసింహరావు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పావులూరి హనుమంతరావు, బిసి సంక్షేమ సంఘం నాయకులు రమణయ్య, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్, బిసి, దళిత, ప్రజా సంఘాల నాయకులు పూలే విగ్రహం వద్ద నివాళి అర్పించారు.
ఇదిలా ఉండగా ఫూలే దంపుతుల విగ్రహాలతో హిందూ కళాశాల జంక్షన్‌లో ఐలాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ బిసి సంఘాల నాయకులు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం నగర కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. వైసిపి ప్రాంతీయ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్, నాయకులు తాడిశెట్టి మురళీ, మాదా రాధ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. టిడిపి జిల్లా కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలువేసి నివాళుర్పించారు. నాయకులు కోవెలమూడి రవీంద్ర, రావిపాటి సాయికృష్ణ, దాసరి రాజా మాస్టరు, డేగల ప్రభాకర్, నశీర్ అహ్మద్ పాల్గొన్నారు.










