ప్రజాశక్తి - అద్దంకి
తెలుగు భాషా దినోత్సవంను సందర్భంగా బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రంజిత్ భాషా ఆధ్వర్యంలో వ్యవహారిక బాషా ఉద్యనేత గిడుగు రామమూర్తి పంతులు 160వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాతృ భాష యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రాంథిక భాష కంటే వ్యవహారిక భాష శ్రేష్ఠమని అన్నారు. అందరికీ సులభ తరంగా ఉంటుందని తెలిపారు. ప్రాచీన గ్రంథాలలో ప్రసిద్ధ కవులు రచించిన భాషాజుషాలను తెలుపుతూ ఆంధ్ర భాషా భేషజము, బాలకవి సరణ్యము లాంటి గ్రంధాలను వ్రాశారని తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని తెలుగు కవులను, తెలుగు అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బాగంగా రిటైర్డ్ తెలుగు అధ్యాపకులు, చారిత్రిక పరిశోధకులు జ్యోతి చంద్రమౌళిని కలెక్టర్ రంజిత్ భాషా ఘనంగా సన్మానించారు.










