Oct 09,2023 21:39

తీవ్రంగా గాయపడ్డా అప్పారావు

పూసపాటిరేగ, విజయనగరంటౌన్‌: పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో గల విజయ నగరం బయోటెక్‌ పరిశ్రమలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చిన నడిపల్లి గ్రామానికి చెందిన బి.అప్పారావు (46), పెద నడిపల్లికి చెందిన ఇనకోటి హరి వెంకట కుమార్‌ (36) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే యాజ మాన్యం నగరంలోని తిరుమల-మెడికవర్‌ ఆస్పత్రిలో చేర్పించింది. మొక్కజొన్న మెటీరియల్‌ను బయటకు తీస్తుండగా, వేడి పౌడర్‌ ఒక్కసారిగా చిమ్మడంతో కార్మికులపై పడి శరీరం కాలిపోయింది. ప్రస్తుతం వారు ఐసియులో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ కార్మికులను పరామర్శించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. యాజమాన్యం మెరుగైన వైద్యం అందిం చాలని, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.