Aug 12,2023 20:15

జయహో భారత్‌ పేరుతో 15న ఆర్ట్‌ కాంటెస్ట్‌

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : కళలను, కళా సంస్కృతిని కాపాడు కోవడంతో పాటు నేటితరం చిన్నారుల్లో దేశభక్తిని పెంపొం దించాలనే ఉద్దేశంతో ఈ నెల 15వ తేదీ జయహో భారత్‌... ప్రౌడ్‌ టుబి యాన్‌ ఇండియన్‌ పేరుతో ఆర్ట్‌ కాంటెస్ట్‌ నిర్వహిస్తున్నామని టాట్మోర్‌ టెర్నింగ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సిఇఒ పద్మలత చెప్పారు. నగరంలోని ఆ సంస్థ కార్యాలయంలో శనివారం ఆర్ట్‌ కాంటెస్ట్‌ పోస్టర్‌ ఆవిష్కరణ చేశారు. పద్మలత మాట్లాడుతూ ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్‌, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, తమ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు. ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్‌ కన్వీనర్‌ ఏ.సునీల్‌ కుమర్‌ మాట్లాడుతూ 15 తేదీ మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు ఈ పోటీలు బందరురోడ్డులోని మాకినేని బసవ పున్నయ్యవిజ్ఞాన కేంద్రం ఆవరణలో జరుగుతాయని చెప్పారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కలెక్టర్‌ డిల్లీరావు చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని అన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 14 తేదీ సాయంత్రం లోగా ఫోరమ్‌ ఫర్‌ ఆర్టీస్ట్‌ విజేఏంజీమెయిల్‌.కామ్‌) వెబ్క్‌సైట్‌లో వివరాలు నవెదు చేసుకోవాలన్నారు. 15 తేది ఆర్ట్‌ కాంటెస్ట్‌ జరిగే ఆవరణలో కూడా పేర్లు నమోదు చేసుకుంటామని చెప్పారు. ఇతర వివరాలకు 77993 08775,79814 35393,88011 04107 నెంబర్లల్లో సంప్రదించాల్సిం దిగా ఆయన కోరారు. ఎంబివికె ప్రతినిధి నారాయణరావు మాట్లాడుతూ ప్రముఖ చిత్రకారులు యడవల్లి రామకృష్ణా, కె.నారాయణరావు, పంతంగి శ్రీనివాస్‌లను సత్కారంతో పాటు భారతీయ భారతి ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈవెంట్‌ ఆర్టనైజర్లు గిరిధర్‌ అరసవల్లి, స్ఫూర్తి శ్రీనివాస్‌, కళాసాగర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.