పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అదీప్‌రాజు తదితరులు
ప్రజాశక్తి-పెందుర్తి : ఈ నెల 7న జరగబోయే జయహో బీసీ సభకు సంబంధించిన పోస్టర్‌ను రాంపురం వైసిపి కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదీప్‌రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బీసీలకు సముచిత స్థానం కల్పించారని చెప్పారు. ఈ సభలో బీసీలకు చేయబోయే కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరిస్తారని తెలిపారు. అభిమానులు కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కీళ్ల అప్పారావు, త్రినాథ్, ఎల్‌బి.నాయుడు, దాసరి రాజు, కోన శీను, గనిశెట్టి కనకరాజు, దేవి, సంభా ఆదిరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.










