Dec 02,2022 23:08

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ 

జయహాో బీసీ మహా సభను జయప్రదం చేయాలని బీసీలకు మాజీ మంత్రి ,ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక భవానీపురంలో గల ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నందు జయహాో బీసీ మహాసభ పోస్టర్‌ను వెలంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల7వ తేదీన విజయవాడలో జరగనున్న జయహాో బిసి మహాసభ 84 వేల మంది బిసి నాయకులతో నిర్వహిస్తున్నామని తెలిపారు. వైఎస్‌ జగన్‌ సిఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో చక్కటి పాలన అందిస్తున్నారన్నారు. చంద్రబాబు బిసిలను, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేశారన్నారు. బిసిలను పరిపాలనలో భాగస్వామ్యం చేసిన వ్యక్తి సిఎం జగన్‌ అని కొనియాడారు. ఎన్టీఆర్‌ జిల్లాలో బిసి పదవుల హాోదాల్లో ఉన్నవారందరూ తప్పనిసరిగా మహాసభకు రావాలని కోరారు. నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్‌, దుర్గగుడి మాజీ ఛైర్మన్‌ పైలా సోమినాయుడు పాల్గొన్నారు.