Oct 13,2023 21:29

కృష్ణవేణి

ప్రజాశక్తి - వీరఘట్టం :  మండలంలోని కిమ్మికి చెందిన గురాన కృష్ణవేణి (28) విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామస్తులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. రెండు నెలల కిందట కృష్ణవేణికి జ్వరం రాగా మందులు వేసు కోవడంతో జ్వరం తగ్గుతూ వస్తుంది. ఈనెల 7న గ్రామంలో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైద్య తనిఖీలు చేసుకోగా, వేరే చోటికి వైద్య తనిఖీలు చేసుకోవాలని వైద్యులు, సలహాలు ఇచ్చారు.  రెండు రోజుల తర్వాత విజయనగరం జిల్లా రాజాం ప్రైవేటు ఆసుపత్రికి పరీక్షలు చేయగా, అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లాలని వైద్యులు సలహా ఇచ్చారు. అక్కడి నుంచి విశాఖకు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమెకు భర్త , కుమార్తె, కుమారుడు ఉన్నారు.