Apr 02,2023 00:59
వైద్య శిబిరంలో పరీక్షలు చేస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-చీరాల: ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్‌ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా శ్రీ కామాక్షి కేర్‌ హాస్పిటల్‌ ముందడుగు వేస్తోందని డాక్టర్‌ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ క్షిరపురి చీరాల వారి సహకారంతో శ్రీ కామాక్షి కేర్‌ హాస్పిటల్‌లో శనివారం ఏర్పాటు చేసిన జ్వరం, నిమ్ము, జలుబు దగ్గు ఉచిత వైద్య శిబిరంలో 70 మంది పేషెంట్లు వైద్య సేవలను పొందారు. అవసరమైన వారికి ఉచిత రక్త పరీక్షలు, మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా మొదటి దశలోని సరైన వైద్యం తీసుకుంటే తక్కువ ఖర్చులో పూర్తి సంపూర్ణ ఆరోగ్యానికి పొందవచ్చని, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మంచి వైద్యాన్ని పొందాలని ఫీవర్‌, షుగర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ తులసీరామ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ తాడివలస సురేష్‌, రోటరీ క్లబ్‌ సభ్యులు, హాస్పటల్‌ సిబ్బంది పాల్గొన్నారు.