Oct 02,2023 00:07

జ్వరాలు సోకితే వెంటనే వైద్యం చేయించుకోవాలి

జ్వరాలు సోకితే వెంటనే వైద్యం చేయించుకోవాలి
ప్రజాశక్తి -దొరవారిసత్రం :జ్వరా లు సోకితే వెంటనే వైద్యం చేయించుకోమని వైద్య సిబ్బంది రోగులకు సూచించారు మండల పరిధిలోని మైలాంగం గ్రామం లో జ్వరాలు సంభవించాయన్న సమాచారంతో ఆదివారం నెలబల్లి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సిబ్బంది ఆ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరం ఉన్న రోగులకు రక్త నమూనాలు సేకరించి మందులు పంపిణీ చేశారు. రోగం స్థాయి తగ్గని పరిస్థితుల్లో వెంటనే పీహెచ్సీ కి వచ్చి లేబరేటరీ లో జ్వరం నిర్థారణ చేసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబంలో పరిసరాల పరిశుభ్రత పాటించి, దోమల ఉత్పత్తికి ఆస్కారం లేకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని సూచించారు. వైద్య శిబిరంలో మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ తస్లీమ్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ విజరు కుమార్‌, సచివాలయ ఏఎన్‌ఎం రమణమ్మ, ఆశా కార్యకర్తలు నిరోషా, సుభాషిని పాల్గొన్నారు.