Sep 08,2023 23:44

పుష్పగుచ్చాన్ని ఇస్తున కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి పాడేరు: అల్లూరి జిల్లా ఏజెన్సీ పర్యట నకు విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్‌. జవహర్‌ రెడ్డికి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పాడేరు ఏజెన్సీ ముఖద్వారం గరికబంద చెక్‌ పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఐటిడిఏ పి ఓ వి.అభిషేక్‌ విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో శనివారం కలెక్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించడానికి సిఎస్‌. పాడేరు చేరుకున్నారు. ఈ కార్య క్రమంలో రంపచోడవం ఐటిడిఏ పిఓ సూరజ్‌ గనోరే తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర. చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి శుక్రవారం రాత్రి మోద కొండమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.