ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: జూపూడి గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులుచ ఎస్‌డబ్ల్యూ పిసిషెడ్ నిర్వహణ ఆర్‌జిఎస్‌ఏ జిపిడిపి 15పైనాన్స్ స్వామిత్వ సర్వే పథకములను పరిశీలించడానికి సోమవారం అధికారుల బృందం వచ్చారు. సిబ్బందిని వారి విధులను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు జారీ చేశారు. కేంద్ర పంచాయితీరాజ్ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ స్పెషల్ సిఎస్ పి ఆర్ డిపార్ట్‌మెంట్ బి రాజశేఖర్ పంచాయితీ రాజ్ కమీషనర్ ఏ సూర్యకుమారి స్పెషల్ కమీషనర్ పి ఆర్‌అండ్ ఆర్‌డి భాగ్యలక్ష్మీ ఎడిషనల్ కమీషనర్ సుధాకర్ ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా సబ్‌కలెక్టర్ అతిథిసింగ్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి జ్యోతిబస్సు ఎన్టీఆర్ జిల్లా పంచాయితీ అధికారి జె సునీత ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అభివృద్ధి అధికారి బివి రామకృష్ణనాయక్ ఇబ్రహీంపట్నం తహశీల్థార్ ఎం సూర్యారావు జూపూడి పంచాయితీ కార్యదర్శి మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










