Nov 24,2022 22:38

ఎక్స్‌రే పరికరాన్ని ప్రారంభిస్తున్న భారత్‌ డైనమిక్స్‌్‌ ప్రతినిధులు

ప్రజాశక్తి - ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా రూ.15 లక్షలు విలువ చేసే ఎక్స్‌రే పరికరాన్ని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ అందజేసింది. గురువారం జూపార్కు వెటర్నరీ ఆసుపత్రిలో ఎక్స్‌రే పరికరాన్ని సంస్థ వైజాగ్‌ యూనిట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌వి కామేశ్వర్‌, హెచ్‌ఆర్‌ ఎన్‌.సత్యనారాయణ డిఎఫ్‌ అనంతశంకర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎసిఎఫ్‌ జి.మంగమ్మ, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ క్యూరేటర్లు గోపి, గోపాలనాయుడు పాల్గొన్నారు.