గుంటూరు: పశువులు, జంతువుల నుండి మానవులకు వ్యాపించే ప్రాణాంతకమైన జునోటిక్ వ్యాధుల పట్ల అప్ర మత్తంగా ఉండాలని అవగాహన సభ్యులు విజ్ఞప్తి చేశారు. గురువారం అరండల్‌పేటలోని సంస్థ కార్యా లయంలో జునోసిస్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ అవేర్‌నెస్ అధ్యక్షులు అచ్యుత ఇందుశేఖర్ మాట్లా డుతూ ఈ వ్యాధి కారకాలు బ్యాక్టీరియా, వైరస్, ప్యార సైట్స్‌గా పిలవబడే పరాన్న జీవులని, ఈ వ్యాధి గురించి అవగాహన పెంచుకోవటానికి జునోసిస్‌డే నిర్వహించు కుంటున్నామని చెప్పారు. జంతు సంక్రమిత వ్యాధుల్లో బ్రసెల్లోసిస్, రేబిస్, దొమ్మరోగం, ఎబోలా వైరస్, మలే రియా, స్వైన్‌ఫ్లూ, డెంగీ, హెచ్‌ఐవి, హెపటైటిస్ తది తరాలు ఉంటాయన్నారు. సీనియర్ ఫార్మసిస్ట్ కె.చంద్ర శేఖర్ మాట్లాడుతూ జంతుమాంసం, జంతువులు కొరి కిన పండ్లు, జంతు స్పర్శ, సాధు జంతువులతో సహ జీవనం చేయడం, దోమకాటు, ఈగలు లాంటి వాటి నుండి మానవులకు సక్రమిస్తాయన్నారు. లాలాజలం, రక్తం, మూత్రం, మలం వంటివి తాకడం ద్వారా జునో టిక్ వ్యాధులు వస్తాయన్నారు. ఇండియాలో తెలియ కుండా చాలా మరణాలు జునోటిక్ వ్యాధుల వల్ల సంభవిస్తున్నాయని చెప్పారు. బి.బి.గుప్త మాట్లాడుతూ వన్యప్రాణులు, పెంపుడు జంతువుల పట్ల జాగ్రత్తగా ఉంటూ, ఆహారం కలుషితం కాకుండా చూసుకోవడం ద్వారా ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు కార్యక్రమంలో మురళీకృష్ణ, చంద్రయ్య ప్రసంగించారు.










