జూనియర్ కళాశాలకు బియ్యం వితరణ
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలం కప్పరాళ్ల తిప్ప గ్రామంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కాండ్ర సతీష్ నాయుడు ముందుకు వచ్చారు. ఏడాది కాలం నుండి విద్యార్థులకు భోజనానికి అవసరమైన బియ్యాన్ని అందిస్తున్నారు. యువనేస్తం సభ్యులు సోమవారం కళాశాలకు విచ్చేసి మధ్యాహ్న భోజనానికి అవసరమైన పది బస్తాలు బియ్యాన్ని అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ కళాశాలకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న విద్యార్థులకు భోజనం అందించడం వల్ల విద్యార్థులు కళాశాలలోనే ఉండి విద్యను అభ్యసించడం తద్వారా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని తెలిపారు. కాండ్ర సతీష్ నాయుడు యువనేస్తం ద్వారా కళాశాలకు సహాయం అందిస్తున్న సతీష్ నాయుడుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి, పిట్ల ప్రతీష్, మత్స్యకార యువత ప్రకాష్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.










