ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
మాజీ సిఎం చంద్రబాబు పర్యటనలో జూనియర్ చంద్రబాబు పలువురిని ఆకట్టుకున్నాడు. గురువారం బిసి సామాజిక తరగతుల సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక బైనేరువాగు సమీపంలోని దండమూడి రామలక్ష్మి వశిష్ట కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన టిడిపి శ్రేణులకు జూనియర్ చంద్రబాబుగా కనిపించిన శ్రీరాప సత్యనారాయణను ఆసక్తిగా తిలకించారు. ఉంగుటూరు నియోజకవర్గం ఫతేపురానికి చెందిన ఆయన చంద్రబాబు అభిమానిగా తన రూపాన్ని మార్చుకుని ఇలాంటి పర్యటనల్లో పాల్గొంటానని తెలిపారు. తన అభిమాన నాయకుడు రూపంలో పర్యటించడం పలువుని ఆకట్టుకోవడం సంతృప్తిని కలిగిస్తుందని చెప్పాడు. అలాగే పలువురు జూనియర్ చంద్రబాబుతో సెల్ఫీలు దిగారు.










