Oct 07,2023 00:06

సందర్శనార్థం డ్రే కాల్‌లోకి విడుదల చేసిన సింహం

ప్రజాశక్తి - అరిలోవ : విశాఖ ఇందిరాగాంధీ జూపార్కు జంతు కుటుంబంలోకి మరో ప్రత్యేక అతిథి చేరింది. గుజరాత్‌లోని సక్కర్‌ బాగ్‌ జంతుప్రదర్శన శాల నుంచి కొన్ని నెలల క్రితం తీసుకొచ్చిన ఆడ సింహాన్ని దాని క్వారంటైన్‌ సమయం అనంతరం జూ పర్యాటకుల సందర్శనార్థం ప్రత్యేక ఎంక్లోజర్‌లోకి శుక్రవారం విడుదల చేశారు. చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు శ్రీకంఠనాథరెడ్డి, జూ క్యూరేటర్‌ నందనీ సలారియా జెండా ఊపి మృగరాజును డే క్రాల్‌లోకి విడుదల చేశారు. సుమారు 2.5 సంవత్సరాల ఈ యువ ఆడ సింహం సందర్శకులను అలరించబోతున్నట్లు తెలిపారు. విద్యార్థులు వన్యప్రాణుల చరిత్ర తెలుసుకొనేందుకు ఈ కొత్త జంతువు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కన్జర్వేటర్‌ మంగమ్మ, జూ సిబ్బంది, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.