ప్రజాశక్తి - ఆదోని
వార్త కవరేజీకి వెళ్లిన కర్నూలు జర్నలిస్టులపై దాడి చేయడం అమానుషమని ఎపిడబ్ల్యుజెఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు బసవరాజు, మునెప్ప విమర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఎఒ గోవింద్ సింగ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విలేకరులపై దాడులు చేయకుండా ప్రత్యేక నివారణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఉపాధ్యక్షులు ఉరుకుందప్ప, కోశాధికారి సుధాకర్, సహాయ కార్యదర్శి సూర్య బెల్ వాల్మీకి సుధాకర్ ఉన్నారు. ఎమ్మిగనూరులో కళ్లకు గంతలు కట్టుకొని ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ జయన్నకు వినతిపత్రం అందజేశారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ తాలూకా అధ్యక్షులు షబ్బీర్ గౌరవాధ్యక్షులు యుకె.చంద్రశేఖర్, దేవేంద్ర మూర్తి, గోనెగండ్ల మండల ఉపాధ్యక్షులు దండు ఖాజా, సిపిఎం నాయకులు హనుమంతు, రాముడు, సిపిఐ నాయకులు పంపన్న గౌడ్, సత్యన్న, రైతు కూలీ సంఘం నాయకులు హనీఫ్ మాట్లాడారు.
ఎఒకు వినతిపత్రం ఇస్తున్న ఎపిడబ్ల్యుజెఎఫ్ నాయకులు










