Oct 06,2023 23:11

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌తోపాటు ఆరుగురు జర్నలిస్టులపై ఎన్‌ఐఎ అక్రమ దాడి, అరెస్టులను నిరసిస్తూ శుక్రవారం కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద ఆంద్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులు, బిజెపి ప్రభుత్వం నిరంకుశ ధోరణి, మీడియాపై అణచివేత నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.నవీన్‌రాజ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కె.మున్ని, అధికార్‌, లోవరాజు, వల్లూరి నానాజీ, దాసరి శ్రీనివాస్‌, బిందాన సురేష్‌, నాయుడు బాబు, వీధి గోపినాధ్‌, వాసంశెట్టి శ్రీనివాస్‌, కృష్ణ, శోభన్‌ కుమార్‌, ముమ్మిడి లక్ష్మణ్‌, పండు పాల్గొన్నారు. జర్నలిస్టు సంఘాల ధర్నాకు అఖిలపక్షం, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ రాజశేఖర్‌, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, పౌర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ నరాల శివ మాట్లాడారు. నఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు, సిఐటియు నగర అధ్యక్షులు పలివేల వీరబాబు, మెడిశెట్టి వెంకటరమణ, రాణి, జెవివి నాయకులు రెడ్డి పాల్గొన్నారు.